-
-
Home » Andhra Pradesh » Kurnool » posting for NHM candidates
-
ఎన్‌హెచ్‌ఎం అభ్యర్థులకు పోస్టింగ్‌లు
ABN , First Publish Date - 2020-12-28T05:21:33+05:30 IST
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆదివారం డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య పోస్టింగ్ ఆర్డర్స్‌ను అందజేశారు.

కర్నూలు(హాస్పిటల్), డిసెంబరు 27: నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆదివారం డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య పోస్టింగ్ ఆర్డర్స్‌ను అందజేశారు. ఎన్‌హెచ్‌ఎం క్రింద ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఏడు ఉండగా, ఐదు మంది పోస్టింగ్ ఆర్డర్స్‌ను అందుకున్నారు. స్టాఫ్‌నర్సు పోస్టులు 203కు గానూ 194 మంది అభ్యర్థులను పిలవగా, 154 మంది ఫిజియోథెరపిస్టులు 11 మంది, ఓటీ అసిస్టెంట్లు నలుగురు, సోషల్ వర్కర్స్ నలుగురికి పోస్టింగ్ ఆర్డర్స్ అందించారు. సెక్రటేరియిటల్ అసిస్టెంట్1, డిస్ర్టిక్ట్ అకౌంట్ ఆఫీసర్ 1, ఫైనాన్స్ కమ్ లాస్టిక్-1, మానిటరింగ్ కన్సల్టెంగ్-1, డిస్ర్టిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు డీఎంహెచ్‌వో ఆర్డర్స్‌ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ఏవో డా.ఖురేషి రాజు, సీనియర్ అసిస్టెంట్లు బి.కుమారస్వామి, సుధాకర్, సంజీవయ్య, మధు పాల్గొన్నారు.