-
-
Home » Andhra Pradesh » Kurnool » political war between leaders
-
పోటా పోటీ.. కాక రేపిన వైసీపీ, బీజేపీ నాయకుల మాటలు
ABN , First Publish Date - 2020-12-27T06:30:16+05:30 IST
శ్రీశైలం వైసీపీ, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. శ్రీశైలంలో అక్రమాలు, అన్యమతస్థుల ప్రమేయంపై నంద్యాల లోక్‌సభ బీజేపీ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపణలు సంధిస్తుండగా.. వాటితో తమకేం సంబంధం లేదని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కొట్టిపడేస్తున్నారు.

- వైసీపీ, బీజేపీ నేతల ఆరోపణల పర్వం
ఆత్మకూరు, డిసెంబరు 26: శ్రీశైలం వైసీపీ, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. శ్రీశైలంలో అక్రమాలు, అన్యమతస్థుల ప్రమేయంపై నంద్యాల లోక్‌సభ బీజేపీ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపణలు సంధిస్తుండగా.. వాటితో తమకేం సంబంధం లేదని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కొట్టిపడేస్తున్నారు. శనివారం ఆత్మకూరులో వేర్వేరు చోట్ల వారు విలేకరులతో మాట్లాడారు. వారి మాటల్లోనే..
నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ నాయకుడు శ్రీకాంత్‌రెడ్డి పిచ్చికుక్కలా వ్యవహరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వగ్రామమైన వేల్పనూరులో 24ఓట్లు సాధించిన ఆయన నాపై విమర్శలు చేసే అర్హత లేదు. శ్రీశైలంలో 70ఏళ్లుగా ముస్లింలు స్థిరపడి ఉన్నారు. దాంతో నాకేం సంబంధం? శ్రీశైలంలోని ముస్లింలను బీజేపీ నేతలు తరిమికొడితే నాకేం సంబంధం ఉండదు. అక్రమాలు జరిగితే పోలీసులు, దేవస్థానం అధికా రులకే సంబంధం. శ్రీశైలంలో వజ్రాలు దొరికాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీసీ కెమెరాల సమక్షంలో జరిగిన పనులు జరిగాయి. నా ప్రమేయంతో శ్రీశైలంలో అక్రమాలు జరిగినట్లు నిరూ పిస్తే రాజీనామాకు సిద్ధం. - శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి
ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డినా? ఆయన తమ్ముడా..? ఎమ్మెల్యే తన తమ్ముడితో అక్రమాలకు పాల్పడుతున్నారు. కమీషన్లు లేనిదే కాంట్రాక్ట్ పనులు చేయనివ్వడం లేదు. శ్రీశైలంలో ఎమ్మెల్యే అక్రమాలు ఎన్నో ఉన్నాయి. శ్రీశైలంలో రజాక్ అనే వ్యక్తికి ఏం పని? ధనబలంతో మత రాజకీయాలు చేస్తున్నది ఎవరో అందరికీ తెలుసు. శ్రీశైలంలో అధికార పార్టీ నేతల ప్రోత్సాహంతో అన్యమతస్తుల ఆగడాలు పెరిగిపో తున్నాయి. శ్రీశైల క్షేత్రాన్ని కాపాడుకుంటాం. ఎమ్మెల్యే శిల్పా టీడీపీలో ఉన్నప్పుడు జగన్‌ను విమర్శించిన వీడియోను సోషల్ మీడియాతో పెట్టారన్న కారణంతో ఓ ముస్లిం యువకున్ని ఆత్మకూరు ఎస్‌ఐతో కొట్టించిన వీడియోను షేర్ చేయించుకున్న మాట వాస్తవం కాదా? -నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ నాయకుడు శ్రీకాంత్‌రెడ్డి