దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

ABN , First Publish Date - 2020-12-04T04:51:44+05:30 IST

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని పలువురు సూచించారు.

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
ఆత్మకూరులో ర్యాలీ నిర్వహిస్తున్న దివ్యాంగులు

  1. అధికారుల సూచన 
  2. ఘనంగా దివ్యాంగుల దినోత్సవం


దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని పలువురు సూచించారు. దివ్యాంగుల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. తల్లిదండ్రులు దివ్యాంగ పిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని సూచించారు.


ఆత్మకూరు, డిసెంబరు 3: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని ఎంఈవో జానకీరామ్‌ అన్నారు. గురువారం స్థానిక భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఐఈఆర్టీ కుదురతుల్లా, ఊర్మిళాదేవీ తదితరులు ఉన్నారు. 


ఆత్మకూరులోని జీవనజ్యోతి దివ్యాంగుల సేవాసంఘం ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్‌ కేక్‌కట్‌ చేశారు. నాయకులు శ్రీనివాసులు, ఆరీఫ్‌ తదితరులు ఉన్నారు. 


వెలుగోడులోని గ్లోబల్‌ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో అమానుల్లా, వైసీపీ నాయకులు మండ్ల శంకరరెడ్డి, జయపాల్‌, రామ్మోహన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, రవి, దివ్యాంగుల సంఘం నాయకులు రంగస్వామి, శ్రీనివాసులు, ఖలీల్‌బేగ్‌, నాగరాజు, వెంకటరమణ, ముర్తుజావలి, సుంకన్న, శ్యామూల్‌, శ్రీను తదితరులు ఉన్నారు. వెలుగోడులోని భవిత కేంద్రంలో నిర్వహించారు. ఎంఈవో బ్రహ్మంనాయక్‌ పాల్గొన్నారు. జగదాంబ టెక్స్‌టైల్స్‌ యజమాని రమేష్‌ దివ్యాంగ పిల్లలకు భోజన పేట్లను పంపిణీ చేశారు. 


నంద్యాల (ఎడ్యుకేషన్‌): ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక న్యాయవాది రావినూతల దుర్గా ప్రసాద్‌ కార్యాలయంలో రాయలసీమ దివ్యాంగుల సేవా సమితి అధ్యక్షుడు, న్యాయవాది బాలసుబ్బయ్య ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ న్యాయవాది రావినూతల దుర్గా ప్రసాద్‌ హాజరై దివ్యాంగుల అభ్యున్నతికి పాటుపడుతున్న సేవా సమితి అధ్యక్షుడు బాలసుబ్బయ్యను కొనియాడారు. కేసీ కెనాల్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ చిన్న వెంకటరాముడు వంద మంది దివ్యాంగులకు దుస్తులను అందించారు. సంఘం అభివృద్ధి కోసం రూ.50 వేల చెక్కును అందజేశారు. కార్పెంటర్‌ లక్ష్మీనారాయణయాదవ్‌ సహకారంతో 150 మంది దివ్యాంగులకు భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. రజక సంఘం అధ్యక్షుడు జిల్లెల్ల శ్రీరాములు, బ్రహ్మణ సంఘం జనరల్‌ సెక్రటరీ సుధీర్‌, విశ్వనాథ్‌, ఉపాధ్యక్షుడు సంజీవరాయుడు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఖాజావలి, చంద్రయ్యగౌడ్‌, కమాల్‌, రామలింగం, రాజు పాల్గొన్నారు.


దివ్యాంగులు ఆత్మవిశ్వాసం, మనోధైర్యంతో ముందుకు సాగాలని నంద్యాల డివిజన్‌ దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ రవికృష్ణ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. 20 మంది దివ్యాంగులకు దీర్ఘకాలిక జబ్బులకు అవసరమైన నెలవారి మందులను అందజేశారు. సంఘం అధ్యక్షుడు సుబ్బారెడ్డి, ముఖ్య సలహాదారుడు రమణయ్య, కోఆర్డినేటర్‌ హనీఫ్‌ఖాన్‌, వెంకటరావు, మురళీధర్‌, మధు పాల్గొన్నారు.


గోస్పాడు: కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించడానికి వైకల్యం అడ్డుకాదని ఎంఈవో అబ్దుల్‌ కరీం అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో భాగంగా గురువారం విద్యార్థులతో పాటు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఎంఈవో మాట్లాడుతూ ఎంతో మంది మేధావులు  వైకల్యాన్ని అధిగమించి చాలా రంగాలలో ప్రతిభ చాటారన్నారు. ప్రభుత్వం కూడా దివ్యాంగులకు సంక్షేమ పథకాలను అందిస్తుందని, భవితా కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఫిజియోథెరపి డాక్టర్‌ను ఏర్పాటు చేసి వారికి అవసరమైన పరికరాలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు కూడా దివ్యాంగ పిల్లలకు సరైన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శోభారాణి, మహేశ్వరరెడ్డి, ఐఈడీ ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి పాల్గొన్నారు.


చాగలమర్రి: దివ్యాంగ విద్యార్థులు ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో రాణించాలని ఎంఈవో అనూరాధ ఆకాంక్షించారు. గురువారం స్థానిక భవిత కేంద్రంలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించారు. దివ్యాంగులు, తల్లిదండ్రులు కలిసి పురవీధుల గుండా ర్యాలీ చేశారు. ఉర్దూ పాఠశాల హెచ్‌ఎం ఈసుల్లాఖాన్‌, ఐఈఆర్టీలు సీతారామయ్య, జగదీష్‌, సీఆర్పీలు అమీర్‌ఖాన్‌, కొండయ్య పాల్గొన్నారు. బాలుర ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం అజరయ్యబాబు, సీనియర్‌ ఉపాధ్యాయులు విజయ్‌కుమార్‌, శ్రీనివాసులు, ఐఈడీఎస్‌ఎస్‌ టీచర్‌ భవాని, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు అందజేశారు.


జూపాడుబంగ్లా: దివ్యాంగుల ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని మండల వెలుగు కార్యాలయంలో నిర్వహించారు. దివ్యాంగులందరినీ సత్కరించారు. దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు, రామంజనేయులు, ఏసీ నరసమ్మ, ఏపీఎం కర్ణాకర్‌, వెలుగు సీసీలు శారదమ్మ, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


పాములపాడు: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని స్ధానిక భవిత సెంటరులో గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖాధికారి బాలాజి నాయక్‌, జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు సుబ్బమ్మ హాజరయ్యారు. ఉపాధ్యాయులు ప్రసన్న లక్ష్మి, సాయికుమార్‌, దేవానంద్‌, దామరేకుల రవి, విజయబాబు, షంషుధ్దీన్‌, పాల్గొన్నారు.


పాణ్యం: పాణ్యంలోని పొదుపు లక్ష్మి భవనంలో నిర్వహించారు. రాజీవ్‌ దివ్యాంగుల పొదుపు గ్రూపు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏపీఎం శేఖర్‌, మండల సమాఖ్య సభ్యులు ఉశేన్‌బీ, మల్లమ్మ, చాంద్‌బాషా, పాల్గొన్నారు. 


దొర్నిపాడు: మండలంలోని దొర్నిపాడు భవిత కేంద్రంలో ఎంఈవో మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. జడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం నారాయణరెడ్డి, ఐఈఆర్టీ రాజేశ్వరి, సుబ్బయ్య తదితరులు ఉన్నారు


రుద్రవరం: రుద్రవరంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. దివ్యాంగులు, ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. హెచ్‌ఎంలు శ్రీనివాసరెడ్డి, సుదర్శన్‌, రాజు, ఐఈఆర్టీలు గుర్రప్ప, ఖాదర్‌బాషా, విజయ్‌కుమార్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


బనగానపల్ల్లె: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని మండల ఎంఈవో స్వరూప సూచించారు. గురువారం పట్టణంలోని భవితకేంద్రంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. భవితకేంద్రం ఉపాఽధ్యాయులు శ్రీనివాసరావు, ఇందిర, గురునాథం సీఆర్పీ సుధాకర్‌రావు, శివరామమద్దిలేటి, వలి, శివప్రసాద్‌, సుబ్బలక్ష్మి, రాజేశ్వరి, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


గడివేముల: దివ్యాంగ విద్యార్థులు మనోధైర్యంతో ముందుకు సాగాలని గడివేముల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేషయ్య, ఆళ్లగడ్డ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవి అన్నారు. ప్రపంచ దివ్యాం గుల దినోత్సవం సందర్భంగా గురువారం భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం అందించే ప్రోత్సహాలపై అవగాహన కల్పించారు. ఎమ్మార్సీ కార్యాలయ సిబ్బంది హిదాయతుల్లా, విజయ్‌, సీఆర్పీలు మెసింజర్‌, భవిత కేంద్రం సిబ్బంది పకీర్‌సాహేబ్‌, ఆంజనేయులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T04:51:44+05:30 IST