పీఈటీ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-03-04T09:43:55+05:30 IST

సీ.బెళగల్‌ మండలంలోని కంబదహాల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న పీఈటీ వి.నరసింహరాజును సస్పెండ్‌ చేసినట్లు డీఈవో సాయిరాం మంగళవారం తెలిపారు.

పీఈటీ సస్పెన్షన్‌

విద్యార్థినుల పట్ల అసభ్యకర ప్రవర్తన 


కర్నూలు(ఎడ్యుకేషన్‌), మార్చి 3: సీ.బెళగల్‌ మండలంలోని కంబదహాల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న పీఈటీ వి.నరసింహరాజును సస్పెండ్‌ చేసినట్లు డీఈవో సాయిరాం మంగళవారం తెలిపారు. పాఠశాలల్లోని విద్యార్థినుల పట్ల నరసింహరాజు  అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థినిల తల్లిదండ్రులు కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం ఉప విద్యాశాఖ అధికారి అనూరాధను విచారణ అధికారిగా నియమించారు. ఆమె పాఠశాలకు  వెళ్లి విద్యార్థులను, అక్కడ పని చేసే ఉపాధ్యాయులను విచారించి నివేదికను జిల్లా విద్యాశాఖాధికారికి సమర్పించారు. ఈ మేరకు నరసింహరాజును సస్పెండ్‌ చేస్తున్న జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.  

Updated Date - 2020-03-04T09:43:55+05:30 IST