గట్టు తవ్వి ఆక్రమణ

ABN , First Publish Date - 2020-04-21T06:42:53+05:30 IST

లాక్‌డౌన్‌తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ కొందరు అక్రమార్కులు ఇదే అదనుగా రెచ్చిపోతున్నారు. కేసీ కాల్వ గట్టును తవ్వి పొలాలుగా మార్చుకుంటున్నారు. జూపాడుబంగ్లా, తరిగోపుల ప్రాంతాల్లో కేసీ కాల్వ గట్టును తవ్వుతున్నారని...

గట్టు తవ్వి ఆక్రమణ

  • దెబ్బతింటున్న కేసీ కాల్వ
  • లాక్‌డౌన్‌లో రెచ్చిపోతున్న అక్రమార్కులు

జూపాడుబంగ్లా, ఏప్రిల్‌ 20: లాక్‌డౌన్‌తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ కొందరు అక్రమార్కులు ఇదే అదనుగా రెచ్చిపోతున్నారు. కేసీ కాల్వ గట్టును తవ్వి పొలాలుగా మార్చుకుంటున్నారు. జూపాడుబంగ్లా, తరిగోపుల ప్రాంతాల్లో కేసీ కాల్వ గట్టును తవ్వుతున్నారని అధికారులకు కూడా సమాచారం అందినట్లు తెలిసింది. కాల్వను తవ్వినవారు మట్టిని కూడా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో కట్ట బలహీనపడుతోంది. కేసీ కాల్వ కుడి, ఎడమ కట్టలు 120 మీటర్ల వెడల్పు ఉంటాయని అధికారులే చెబుతున్నారు. ప్రస్తుతం ఆక్రమణల కారణంగా ఇవి దెబ్బతిన్నాయి. మండల పరిధిలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో కట్టను ఆక్రమించి పంటలు సాగు చేసినట్లు సమాచారం. అధికారులు ప్రశ్నిస్తే ఇప్పటికే ఆక్రమించుకున్న వారి మాటేమిటని కొందరు గతంలో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఆక్రమించిన వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇప్పటికైనా స్పందించి కేసీ కాల్వను పరిరక్షించాలని రైతులు కోరుతున్నారు. 


లాక్‌డౌన్‌ తర్వాత చర్యలు..

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఆక్రమణకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. బాఽధ్యలపై కేసులు నమోదు చేయిస్తాం. కేసీ పోరంబోకు సరిహద్దులు గుర్తించి, ఆక్రమణలు జరగకుడా గుంతలు తవ్విస్తాం. 

- నరేష్‌, కేసీ కాల్వ ఏఈ

Updated Date - 2020-04-21T06:42:53+05:30 IST