రూ.కోటి స్వాధీనం
ABN , First Publish Date - 2020-07-18T10:50:31+05:30 IST
నంద్యాల టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలో రూ1,00,80,000 స్వాధీనం చేసుకున్నట్లు పాణ్యం సీఐ జీవన్ గంగనాథ్‌బాబు ..

వాహనాల తనిఖీలో నగదు
పోలీసుల అదుపులో ఇద్దరు
పాణ్యం, జూలై 17: నంద్యాల టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలో రూ1,00,80,000 స్వాధీనం చేసుకున్నట్లు పాణ్యం సీఐ జీవన్ గంగనాథ్‌బాబు తెలిపారు. కర్నూలు, కడప జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున తనిఖీలు నిర్వహించామని ఆయన తెలిపారు. పాణ్యం సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. హైదరాబాదు నుంచి కోయంబత్తూరుకు వెళ్తున్న టీఎస్ 12 ఈఎఫ్ 9003 నెంబరు గల టాటా హెక్సా కారులో ఈ నగదు గుర్తించామని తెలిపారు. ఎలాంటి ఆధారాలు, రికార్డులు లేకపోవడంతో నగదు, కారు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
ఈ డబ్బు తరలిస్తున్న చార్మినార్‌కు చెందిన గైక్వాడ్ దత్తాత్రేయ విఠల్, మలక్‌పేటకు చెందిన కాశీనాథ్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. బంగారు ఆభరణాలను అక్రమంగా కొనుగోలు చేయడానికి వెళుతున్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని తెలిపారు. నగదును ఆదాయపన్నుశాఖకు అప్పగిస్తామన్నారు. సమావేశంలో ఎస్‌ఐ రాకేష్, టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు.