పంటల బీమా ఉపయోగించుకోండి
ABN , First Publish Date - 2020-11-14T05:18:30+05:30 IST
రైతులు పంటల బీమా ఉప యోగించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్ సూచిం చారు.
- వ్యవసాయ కమిషనర్
కోడుమూరు(రూరల్), నవంబరు 13: రైతులు పంటల బీమా ఉప యోగించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్ సూచిం చారు. శుక్రవారం మండలంలోని ప్యాలకుర్తి రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. రహదారి పక్కన వేరుశనగ పైరును పరిశీలించారు. అనంతరం ఆర్బీకేలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రబీలో సాగుకు వేరుశనగ ఉల్లి విత్తనాలను సబ్సిడీపై అందించాలని, పత్తి దిగుబడులు విక్రయించడానికి సీసీఏ అధికారులు లేనిపోని నిబంధనలు విధిస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ శ్రీనివాసులు 170 క్వింటాళ్లు వేరుశనగ అందించడానికి ముందుకు వచ్చారు.
గూడూరు: మండలంలోని కే.నాగులాపురం, పెంచికలపాడు గ్రామాల్లో శుక్రవారం వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ పర్యటించారు. రైతులు సాగు చేసిన పత్తి పంటలను పరిశీలించారు. జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీడీఏ బోసుబాబు, ఏడీఏ విజ యశంకర్‌రెడ్డి, ఏవో శ్రీవర్థన్‌రెడ్డి, శాస్త్రవేత్తలు, ఏఈవోలు, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.