-
-
Home » Andhra Pradesh » Kurnool » our governemnt is faithful
-
నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం
ABN , First Publish Date - 2020-12-29T04:45:41+05:30 IST
న్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
డోన్, డిసెంబరు 28: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సోమవారం డోన్ మండలంలోని చిన్నమల్కాపురం, మల్లెంపల్లి గ్రామాల్లో ఇళ్ల పట్టాలను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ స్వాత్రంత్యం వచ్చినప్పటి నుంచి 2019 వరకు రాష్ట్రంలో 10 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే.. ఈ ఏడాదిన్నర పాలనలోనే సీఎం జగన్ 31 లక్షల మందికి ఇచ్చి ప్రజల పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు పొదుపు మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పారని, పసుపు కుంకుమతో లబ్ధి పొందాలని జిమ్మికులు చేసిన చంద్రబాబును మహిళలు తిరస్కరించారన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల మంజూరు కోసం నాయకుల ఇళ్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలా కాకుండా అర్హులందరికీ స్థలం ఇచ్చి ఇళ్లు మంజూరు చేశారన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కేఎల్‌ఎన్ రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ మల్లెంపల్లి రామచంద్రుడు, సింగిల్ విండో చైర్మన్ వెంకట సుబ్బమ్మ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రేగటి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రూ.14.15 కోట్ల పనులకు శంకుస్థాపన : డోన్ పట్టణంలో రూ.14.15 కోట్లతో నిర్మిస్తున్న రోడ్ల విస్తరణ సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులకు మంత్రి బుగ్గన శంకుస్థాపన చేశారు. రూరల్ పోలీ్‌స్‌స్టేషన్ హైవే నుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు రూ.4.40 కోట్లతో డబుల్ రోడ్డు పనులకు మంత్రి భూమి పూజ చేశారు. అదే విదంగా గుత్తి రోడ్డులోని అమ్మా హోటల్ నుంచి యు.కొత్తపల్లి హైవే వరకు రూ.9.75 కోట్లతో నిర్మించే డబుల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అందరికీ ఇళ్లు నిర్మించడమే సీఎం ధ్యేయం:మంత్రి
చిప్పగిరి, డిసెంబరు 28: రాష్ట్రంలో ప్రతి నిరుపేదకు సొంత ఇల్లు నిర్మించడమే సీఎం జగన్మోహన్‌రెడ్డి ముఖ్య ధ్యేయమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. సోమవారం మండలంలోని రామదుర్గం, నగరడోణ, తిమ్మాపురం గ్రామాల్లో ఇంటి పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండలంలో 1284 పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో వేదవతి ప్రాజెక్టుకు భూమిపూజ చేశామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగు, తాగునీరు అందుతాయన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు ఖాదర్‌బాషా, రామచంద్రారెడ్డి, తహసీల్దార్ వలీబాషా, ఎంపీడీవో అక్బర్‌సాబ్, ఈవోఆర్డీ వరలక్ష్మి, ఎంపీపీ అభ్యర్థి హేమలత, జడ్పీటీసీ విరుపాక్షి, వైసీపీ మండల కన్వీనర్ గుమ్మనూరు నారాయణ, విక్రాంత్‌రెడ్డి, వైసీపీ యువనాయకులు జూటూరు మారయ్య, ధనుంజయ, శ్రీకాంత్‌రెడ్డి, భీమిరెడ్డి, ఓబులేష్, నాగప్ప, నాగేంద్ర, శేఖర్, గుంతకల్లు సూరి, సొసైటీ డైరెక్టర్ గోవిందరాజు, నరసింహులు, ధర్మేంద్ర, రాజన్న, బాలకృష్ణ, ఈరప్ప, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.