-
-
Home » Andhra Pradesh » Kurnool » one person arrested in the case of attack on children
-
పిల్లలపై దాడి చేసిన వ్యక్తి అరెస్టు
ABN , First Publish Date - 2020-11-21T05:30:00+05:30 IST
మండలంలోనిమండలంలోని పడమర ప్రాతకోట గ్రామంలో పిల్లలపై దాడి చేసిన సగినేల రమణను శనివారం అరెస్ట్ చేసినట్లు ముచ్చుమర్రి ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

పగిడ్యాల, నవంబరు 21: మండలంలోనిమండలంలోని పడమర ప్రాతకోట గ్రామంలో పిల్లలపై దాడి చేసిన సగినేల రమణను శనివారం అరెస్ట్ చేసినట్లు ముచ్చుమర్రి ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. నాలుగురోజల క్రితం గ్రామంలో వైసీపీ వర్గీయులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. ఈద్గా సమీపం లోని నీళ్ల ట్యాంక్ సమీపంలో మైదానంలో ఆడుకుంటున్న పిల్లల ఉపేంద్ర, సంతోష్, హరికృష్ణను కొట్టిన కేసులో రమణను అరెస్టు చేశారు. నందికొట్కూరు జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపర్చగా మెజిస్ట్రేట్ తిరుమలరావు రిమాండ్‌కు ఆదేశించినట్లు ఎస్‌ఐ తెలిపారు.