‘14న రోడ్ల దిగ్బంధం’

ABN , First Publish Date - 2020-12-12T04:59:32+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దుకై ఈ నెల 14న రోడ్ల దిగ్బంధం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పేర్కొన్నారు.

‘14న రోడ్ల దిగ్బంధం’


ఆదోని, డిసెంబరు 11: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దుకై   14న రోడ్ల దిగ్బంధం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో గిడ్డయ్య మాట్లాడుతూ  దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉరితాడు వేసే విధంగా రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టడం సిగ్గుచేటు అన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో లక్షలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.  మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని  14న జరిగే రోడ్ల దిగ్బంధం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అయ్యప్పగౌడ్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్‌, మండల కార్యదర్శి బసాపురం గోపాల్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు అజయ్‌బాబు, జిల్లా సమితి సభ్యులు ఓబీ నాగరాజు, కల్లుబావి రాజు, వెంకన్న పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T04:59:32+05:30 IST