మహానందిలో అధికార భాషా సంఘం సభ్యులు
ABN , First Publish Date - 2020-12-11T05:32:48+05:30 IST
మహానంది శైవ క్షేత్రంలో ఏపీ అధికార భాషా సంఘం కమిటీ సభ్యులు మోదుగుల పాపిరెడ్డి, చందు సుబ్బారావు, షేక్ మస్తాన్ గురువారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహానంది, డిసెంబరు 10: మహానంది శైవ క్షేత్రంలో ఏపీ అధికార భాషా సంఘం కమిటీ సభ్యులు మోదుగుల పాపిరెడ్డి, చందు సుబ్బారావు, షేక్ మస్తాన్ గురువారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయం ముఖద్వారం వద్ద టెంపుల్ ఇన్‌స్పెక్టర్ హరినాథ్ ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయాల్లో కమిటీ సభ్యులు మహానందీశ్వరునికి, కామేశ్వరిదేవి అమ్మవారికి కార్తీక మాసం పూజలు నిర్వహించారు. కళ్యాణ మంటపంలో వేదపండితులు. ఆలయ అర్చకుడు మామిళ్ళపల్లి రాఘవేంద్రశర్మ వారిని సన్మానించి, ప్రసాదాలు అందజేశారు.