తూనికలు, కొలతల అధికారి తనిఖీలు
ABN , First Publish Date - 2020-11-26T06:23:40+05:30 IST
కొలిమిగుండ్ల, అవుకు మండలాల్లో డోన్ డివిజన్ తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ ఎన్. నాగరాజు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

- 15 కేసులు నమోదు, రూ.72 వేలు జరిమానా
కొలిమిగుండ్ల, నవంబరు 25: కొలిమిగుండ్ల, అవుకు మండలాల్లో డోన్ డివిజన్ తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ ఎన్. నాగరాజు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణాలను తనిఖీ చేసి తూనికలు, అనుమతి పత్రాలు మొదలగు వాటిని పరిశీలించారు. తూనికలు, పత్రాలు సరిగ్గా లేనందున, నిబంధనలు దుకాణదారులు ఉల్లంఘించడంతో 15 కేసులు నమోదు చేసి దుకాణదారులకు రూ.72వేలు జరిమానా విధించారు. ఆయన వెంట శ్రీనివాసులు పాల్గొన్నారు.