అధికారులు స్పందించలేదు మరి..!

ABN , First Publish Date - 2020-12-10T05:51:35+05:30 IST

భారీ వర్షాలకు చిప్పగిరి-దౌల్తాపురం రహదారి పూర్తిగా దెబ్బతింది. గుంతలు పడి వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది.

అధికారులు స్పందించలేదు మరి..!
చదును చేస్తున్న రైతులు

  1. పల్లె దారిని బాగుచేసుకున్న ప్రజలు


చిప్పగిరి, డిసెంబరు 9: భారీ వర్షాలకు చిప్పగిరి-దౌల్తాపురం రహదారి పూర్తిగా దెబ్బతింది. గుంతలు పడి  వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన కనిపించలేదు. దీంతో ప్రజలు చేయి చేయి కలిపి దారిని బాగు చేసుకుంటున్నారు. గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ యజమానులు గ్రావెల్‌ మట్టిని తీసుకువచ్చారు. ఎక్స్‌కవేటర్ల సాయంతో గుంతలను పూడుస్తూ, మట్టి వేసి చదును చేస్తూ రహదారిని బాగు చేశారు. దారికి ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలు తొలగించారు. వాహనాలు వెళ్లేందుకు వీలులేక, కాలి నడకన వెళుతున్నామని, అధికారులు స్పందించకపోవడంతో తామే దారిని బాగుచేసుకుంటున్నామని రైతులు, కూలీలు, ట్రాక్టర్ల యజమానులు దౌల్తాపురం చంద్ర, గద్దల ఎర్రన్న, రామకృష్ణ, తోట రంగప్ప, తిమ్మారెడ్డి, శ్రీరాములు, ఎర్రప్ప, కట్టకింద హనుమంతు, గద్దల మల్లయ్య, కురువ సుంకన్న, ఆరచర్ల నారి తదితరులు తెలిపారు. 

Updated Date - 2020-12-10T05:51:35+05:30 IST