ఇరుకుస్థలంలో కూరగాయల హోల్‌సేల్‌ మార్కెట్‌

ABN , First Publish Date - 2020-04-14T10:53:51+05:30 IST

పత్తికొండ సంతమార్కెట్‌లో ప్రతిరోజూ హోల్‌సేల్‌ మార్కెట్‌ తెల్లవారుజామున 2గంటల నుంచి 6గంటల

ఇరుకుస్థలంలో కూరగాయల హోల్‌సేల్‌ మార్కెట్‌

 భౌతిక దూరం పాటించడం లేదు 

 మార్కెట్‌ను మార్చాలంటున్న ప్రజలు


పత్తికొండ. ఏప్రిల్‌ 13 : పత్తికొండ సంతమార్కెట్‌లో ప్రతిరోజూ హోల్‌సేల్‌ మార్కెట్‌ తెల్లవారుజామున 2గంటల నుంచి 6గంటల వరకు సాగుతుంది. కూరగాయల కొనుగోళ్లకు చట్టుపక్కల గ్రామాల వ్యాపారులు మార్కెట్‌ వస్తారు. కాగా మార్కెట్‌ ప్రాంతం చిన్నగా ఉండడంతో వ్యాపారుల రద్దీ నడుమే అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతుంటాయి.  లాక్‌డౌన్‌ ప్రకటించినా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కరోనా కేసులు  తీవ్రతరమైన ప్రాంతాలను  రెడ్‌జోన్లుగా ప్రకటించడంతో అక్కడ కూరగాయాల మార్కెట్ల నిర్వహణలను రద్దు చేశారు. దీంతో డోన్‌, కోడుమూరు ప్రాంతాల నుంచి వ్యాపారులు పత్తికొండ మార్కెట్‌కు వచ్చి కూరగాయలు కొంటున్నారు. ఇక్కడ భౌతిక దూరం పాటించకపోవడంతో వ్యాపారులు,  ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 


Updated Date - 2020-04-14T10:53:51+05:30 IST