గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-12-04T05:19:37+05:30 IST

గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మండల అధికారులు కృషి చేయాలని నంద్యాల సబ్‌కలెక్టర్‌ కల్పనాకుమారి ఆదేశించారు.

గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

  1. నంద్యాల సబ్‌కలెక్టర్‌ కల్పనాకుమారి


మహానంది, డిసెంబరు 3: గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మండల అధికారులు కృషి చేయాలని నంద్యాల సబ్‌కలెక్టర్‌ కల్పనాకుమారి ఆదేశించారు. గురువారం మహానంది మండలం గాజులపల్లి పంచాయతీ పరిధిలోని ఆంజనేయపురం కొట్టాల, బుచ్చమ్మతోపులోని గిరిజన కాలనీలలో సబ్‌కలెక్టర్‌ సందర్శించారు. మురుగు కాలువలు, మంచినీరు, విద్యుత్‌ సరఫరా గురించి గిరిజనులను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం అధికారులతో సబ్‌కలెక్టర్‌ సమస్యలపై చర్చించారు. ఇన్‌చార్జి తహసీల్దార్‌ నారాయణరెడ్డి, ఎంపీడీవో సుబ్బరాజు, పంచాయితీ కార్యదర్శులు వెంకటయ్య, శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:19:37+05:30 IST