టీడీపీతోనే పేదల జీవితాల్లో వెలుగు

ABN , First Publish Date - 2020-03-30T10:58:09+05:30 IST

పేదల జీవితాల్లో వెలుగు నింపింది తెలుగుదేశం పార్టీయేనని, ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గొర్రెలు, మేకల ఫెడరేషన్‌ చైర్మన్‌ వై.నాగేశ్వరరావు యాదవ్‌ పునరుద్ఘాటించారు.

టీడీపీతోనే పేదల జీవితాల్లో వెలుగు

పార్టీ జిల్లా కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ 


కర్నూలు(అగ్రికల్చర్‌), మార్చి 29: పేదల జీవితాల్లో వెలుగు నింపింది తెలుగుదేశం పార్టీయేనని, ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గొర్రెలు, మేకల ఫెడరేషన్‌ చైర్మన్‌ వై.నాగేశ్వరరావు యాదవ్‌ పునరుద్ఘాటించారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంట్లోనే నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని, కేవలం 8 నెలల కాలంలో రాష్ట్రమంతా పర్యటించి అధికారాన్ని కైవసం చేసుకుని గిన్నిస్‌ రికార్డు సాధించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలుగు రాష్ట్రానికి గౌరవం దక్కిందని పేర్కొన్నారు.   


గౌరు ఆధ్వర్యంలో ఘనంగా..

కల్లూరు: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్థానిక మాధవీనగర్‌లోని తన స్వగృహంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి 38వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే దివంగత నందమూరి తారకరామారావు అధికారం చేపట్టారని కొనాయాడారు. రాష్ట్రంలో అర్హులందరికీ కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఆదర్శవంతమైన పాలన అందించారని పేర్కొన్నారు. బీసీలకు రాజ్యాధికారంతో పాటు అనేక సంస్కరణలను తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పెరుగు పురుషోత్తం రెడ్డి, నాయకులు నాగేశ్వరరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. 


టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

నందవరం: మండలంలో ఆదివారం పార్టీ నాయకులు టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. దేశాయి మాధవరావు ఇంట్లో జరిగిన కార్యక్రమంలో మాజీ స్పంచ్‌ రామన్నగౌడు, వెంకటేశ్వర్లు, ఈరన్న, శ్రీనివాసులు, ఈస, షరీఫ్‌, గుంటెప్ప, పంపయ్య పాల్గొన్నారు.


 పేదల కోసమే..

గోనెగండ్ల: పేదల కోసమే టీడీపీ ఆవిర్భవించిందని జిల్లా టీడీపీ మాజీ కార్యదర్శి ప్రభాకర్‌నాయుడు, బేతాల బడేసా, రామాంజనేయులు, రంగస్వామినాయుడు, తిరుపతయ్యనాయుడు, నూర్‌ అహమ్మద్‌ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. మాజీ సర్పంచ్‌ రంగముని, మాజీ ఉపసర్పంచ్‌ రమే్‌షనాయుడు, యూనూస్‌, దరగల మాబు, కొత్తింటి ఫకృద్దీన్‌, ఉరుకుందు, మారేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-30T10:58:09+05:30 IST