మరిన్ని బస్సులు: ఆర్‌ఎం

ABN , First Publish Date - 2020-06-06T09:24:07+05:30 IST

ఆర్టీసీ కర్నూలు రీజియన్‌లో మరిన్ని బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు రీజియన్‌ మేనేజర్‌ టి.వెంకటరామం

మరిన్ని బస్సులు: ఆర్‌ఎం

కర్నూలు(రూరల్‌) జూన్‌ 05 : ఆర్టీసీ కర్నూలు రీజియన్‌లో మరిన్ని బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు రీజియన్‌ మేనేజర్‌ టి.వెంకటరామం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లాక్‌డౌన్‌ నేపఽథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గత నెల 21న ప్రజారవాణాను 126 బస్సులతో ప్రారంభించామని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని బస్సులను తిప్పనున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 260 బస్సులను తిప్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


నంద్యాల, ఆదోని, ఆత్మకూరు, బనగానపల్లె, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, డోన్‌, పత్తికొండ, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల వంటి డిపోల నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సును నడుపున్నట్లు తెలిపారు. వాటితో పాటు కర్నూలు నుంచి విజయవాడ, వైజాగ్‌, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కూడ బస్సులను తిప్పుతున్నామని తెలిపారు. దూర ప్రాంతాలకు రిజర్వేషన్‌ సదుపాయం కల్పించామన్నారు.

Updated Date - 2020-06-06T09:24:07+05:30 IST