-
-
Home » Andhra Pradesh » Kurnool » mlc ke prabhakar fire
-
మీడియాను అణచివేసే ప్రయత్నం
ABN , First Publish Date - 2020-12-29T05:17:31+05:30 IST
మీడియాను అణచి వేసే ప్రయత్నం చేస్తే తగిన గుణపాఠం తప్పదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కేఈ.ప్రభాకర్ అన్నారు.

- మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్
కర్నూలు(అర్బన్), డిసెంబరు 28: మీడియాను అణచి వేసే ప్రయత్నం చేస్తే తగిన గుణపాఠం తప్పదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కేఈ.ప్రభాకర్ అన్నారు. సోమవారం నగరంలోని శ్రీకృష్ణ దేవరాయలు సర్కిల్‌లో జర్నలిస్టుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షకు హాజరైన కేఈ ప్రభాకర్ నాయకులకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వెంటనే జీవో నెంబర్ 142ను రద్దు చేయాలని కోరారు. ఈదీక్షలో రాయలసీమ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు బత్తిన నవీన్, సీనియర్ జర్నలిస్టు సత్యన్న, ఏపీజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఏపీడబ్ల్యూజే నాయకులు మౌలాలి కూర్చున్నారు.