పట్టాల పంపిణీలో ఎమ్మెల్యేకు సెగ

ABN , First Publish Date - 2020-12-29T05:29:32+05:30 IST

కోడుమూరు ఎమ్మెల్యే డా. సుధాకర్‌కు పట్టాల పంపిణీ కార్యక్రమంలో అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి.

పట్టాల పంపిణీలో ఎమ్మెల్యేకు సెగ

  1.   రహదారిపై అడ్డుకున్న నిడ్జూరు గ్రామస్థులు


కర్నూలు(రూరల్‌), డిసెంబరు 28: కోడుమూరు ఎమ్మెల్యే డా. సుధాకర్‌కు పట్టాల పంపిణీ కార్యక్రమంలో అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యే సుధాకర్‌ సోమవారం కర్నూలు మండలంలోని నిడ్జూరు గ్రామంలో పునరావాస కాలనీలో నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు పథకం కింద ఇంటిపట్టాల పం పిణీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు  వెళ్తుండగా  గ్రామస్థులు అడ్డుకున్నారు. కర్నూలు మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ రాంభూపాల్‌రెడ్డి, నేతృత్వంలో గ్రామస్థులు  ఎమ్మెల్యే వాహనాన్ని రహదారిపై నిలిపివేశారు. అప్పటికే ప్రజలు ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేస్తు ఇంటి పట్టాల కేటాయింపులో అన్యాయం చేశారంటూ నిలదీశారు. గ్రామస్తులు ఒక్కసారిగా ఎమ్మెల్యేను చుట్టు ముట్టే ప్రయత్నం చేశారు. గ్రామంలో కొత్తగా భూసేకరణ చేసి స్థానికులకు మూడు సెంట్ల చొప్పున స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే సుధాకర్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం సుధాకర్‌  పునరావాస కాలనీకి వెళ్లి 23 మందికి సెంటు పావు చొప్పున ఇంటిపట్టాలు పంపిణీ చేశారు.  

Updated Date - 2020-12-29T05:29:32+05:30 IST