దౌర్జన్యం చేస్తే పార్టీ నుంచి వెలివేస్తాం: ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-09-06T17:25:31+05:30 IST

వైసీపీలో ఉంటూ దౌర్జన్యాలు చేసే వారిని ఉపేక్షించనని, పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు..

దౌర్జన్యం చేస్తే పార్టీ నుంచి వెలివేస్తాం: ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి

ఆదోని(కర్నూలు): వైసీపీలో ఉంటూ దౌర్జన్యాలు చేసే వారిని ఉపేక్షించనని, పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన హైదరాబాద్‌ నుంచి ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్‌లో మాట్లాడారు. శుక్రవారం సచివాలయ ఉద్యోగులపై పరుష పదజాలంతో దూషించడమే కాకుండా దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించానన్నారు. ఇలాంటి వారి వల్ల తనపై ప్రజలకు చెడ్డపేరు వస్తుందని, ఇలాంటి వారిని ఉపేక్షించేదేలేదని హెచ్చ రించారు. సచివాలయ ఉద్యోగులతో మాట్లాడి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానన్నారు. 

Updated Date - 2020-09-06T17:25:31+05:30 IST