-
-
Home » Andhra Pradesh » Kurnool » mla katasani requested to cm jagan during kurnool tour
-
సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2020-11-21T06:24:23+05:30 IST
పాణ్యం నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కోరారు.

ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కాటసాని వినతి
ఓర్వకల్లు, నవంబరు 20: పాణ్యం నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కోరారు. తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో కలిసి వినతి పత్రం ఇచ్చారు. పాణ్యం నియోజకవర్గం పరిధిలోని కల్లూరు అర్బన్-16 మున్సిపల్ వార్డులకు నీటి సమస్యను పరిష్కరించి అదనపు సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నిర్మించాలని కోరారు. ఓర్వకల్లు మండలంలో సాగు, తాగునీటి సమస్యలు లేకుండా తీర్చాలన్నారు. ఓర్వకల్లులో రిజర్వాయర్‌ను ఏర్పాటు చేసి పరిశ్రమలకు నీరందించాలన్నారు. బుడగ జంగాలను ఎస్సీలో చేర్చి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. పాలకొలనులో నిర్మాణంలో ఉన్న డీఆర్‌డీవోలో భూములు కోల్పోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం ఇప్పించాలని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే కోరారు. వీటిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే కాటసాని తెలిపారు.
ఎయిర్‌పోర్టు పనులు త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్
ఓర్వకల్లు విమనాశ్రయం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీర పాండియన్ ఎయిర్‌పోర్టు అధికారులను ఆయన ఆదేశించారు. తుంగభద్ర పుష్కరాల ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి విమానం దిగి అక్కడి నుండే జరుగుతున్న పనులను కలెక్టర్ ముఖ్యమంత్రికి చూపించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం జిల్లా ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.