-
-
Home » Andhra Pradesh » Kurnool » minister bugana
-
అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం ధ్యేయం: మంత్రి
ABN , First Publish Date - 2020-11-21T06:33:49+05:30 IST
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్యే యమని, అందుకే అన్ని వర్గాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా కులాలకు సముచిత స్థానం కల్పించారని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

బేతంచెర్ల,నవంబరు 20: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్యే యమని, అందుకే అన్ని వర్గాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా కులాలకు సముచిత స్థానం కల్పించారని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణానికి చెందిన మురళీకృష్ణను రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టరుగా ఎంపిక చేయడం పట్ల వాల్మీకి సంఘం నాయకులు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని, ఆయన సోదరుడు బుగ్గన నాగభూషణంరెడ్డిలను మంత్రి స్వగృహంలో శుక్రవారం సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ సీఎం జగన్మోహన్‌రెడ్డి జనరంజక పా లన అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు బ్రహ్మనాయుడు, ఆకుల రమణ, రామనాయుడు, వెంకటరాముడు, కృష్ణమూర్తి, రాముడు, భాస్కర్, నిరంజన్, కిరణ్ పాల్గొన్నారు.