సిఫారసు ఉంటేనే మినీ ట్రక్కు

ABN , First Publish Date - 2020-12-07T05:32:54+05:30 IST

మినీ ట్రక్కుల పంపిణీ లబ్ధిదారుల ఎంపికలో పైరవీలు తీవ్రమ య్యాయి.

సిఫారసు ఉంటేనే మినీ ట్రక్కు

  1. ఎంపికలో అధికార పార్టీ ముద్ర
  2. ఇంటర్వ్యూలు లాంఛన ప్రాయమే..!


డోన్‌, డిసెంబరు 6: మినీ ట్రక్కుల పంపిణీ లబ్ధిదారుల ఎంపికలో పైరవీలు తీవ్రమ య్యాయి. అధికార పార్టీ సిఫార సులు ఉన్న వారికే మినీ ట్రక్కులు దక్కుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. డోన్‌ సబ్‌ డివిజన్‌లో జోరుగా ఈ తంతు నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెల నుంచి ఇంటింటికీ రేషన్‌ బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మినీ ట్రక్కుల ద్వారా రేషన్‌ తరలించి ఇళ్ల వద్ద పంపిణీ చేయాలని నిర్ణయిం చింది. దీంతో మినీ ట్రక్కుల పంపిణీ కోసం అర్హతగల డ్రైవర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. డోన్‌ మున్సిపాలిటీలో 15 మినీ ట్రక్కులకు వందకు పైగా దరఖాస్తులు వచ్చాయి. డోన్‌ మండలంలో 15 మినీ ట్రక్కులకు 143 దరఖాస్తులు వచ్చాయి. ప్యాపిలి మండలంలో 14 మినీ ట్రక్కులకు 120 పైగా దరఖాస్తులు వచ్చాయి. క్రిష్ణగిరి మండలంలో 10 మినీ ట్రక్కులకు 68, వెల్దుర్తి మండలంలో 12 మినీ ట్రక్కులకు 112 దరఖాస్తులు వచ్చాయి. 


సిఫారసు ఉంటేనే

లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ ముద్ర కనిపిస్తోంది. సిఫారసులు ఉన్న వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు విమర్శలు ఉన్నాయి. డోన్‌ సబ్‌ డివిజన్‌లో 67 మినీ ట్రక్కులకు గానూ 420పైగా దరఖాస్తులు వచ్చాయి. లబ్ధిదారుల ఎంపికకు శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహిం చారు. ఎంపికలో అధికార పార్టీ నేతల జోక్యం మితిమీరినట్లు సమాచారం. అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చారని తెలిసింది. అధికార పార్టీ నేతలు సిఫారసు చేసిన వారినే ఎంపిక చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. 


తూతూ మంత్రం..

లబ్ధిదారుల ఎంపికకు ఇంట ర్వ్యూలు తూతూమంత్రంగా జరిగాయి. అధికార పార్టీ నేతల నుంచి ముందుగానే అధికారులకు జాబితా చేరినట్లు తెలుస్తోంది. పలానా దరఖాస్తుదారుడికి ట్రక్కు ఇవ్వాలని నేతల నుంచి సిఫారసులు వెళ్లినట్లు సమాచారం. నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వారు సూచించిన పేర్లనే అధికారులు ఎంపిక  చేసినట్లు తెలిసింది.

Updated Date - 2020-12-07T05:32:54+05:30 IST