లాక్‌డౌన్‌ పాటించకపోతే చర్యలు: డీఎస్పీ

ABN , First Publish Date - 2020-03-25T10:40:01+05:30 IST

లాక్‌డౌన్‌ పాటించకపోతే చర్యలు తప్పవని ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావు, మున్సిపల్‌ కమిషనర్‌ అంకిరెడ్డి ప్రజలను హెచ్చరించారు.

లాక్‌డౌన్‌ పాటించకపోతే చర్యలు: డీఎస్పీ

నందికొట్కూరు, మార్చి 24: లాక్‌డౌన్‌ పాటించకపోతే చర్యలు తప్పవని ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావు, మున్సిపల్‌ కమిషనర్‌ అంకిరెడ్డి ప్రజలను హెచ్చరించారు. లాక్‌డౌన్‌ పరిస్థితిని డీఎస్పీ పరిశీలించారు. కిరాణ దుకాణాలు, కూరగాయల మార్కెట్‌ మినహా అన్ని వ్యాపార దుకాణాలను మూసివేయించారు. పట్టణానికి ఇరువైపులా కేజీకు అడ్డంగా కట్టెలు కట్టి  వాహనాలు తిరగకుండా రోడ్డును బ్లాక్‌ చేశారు. నందికొట్కూరు అర్బన్‌, రూరల్‌ సీఐలు నాగరాజారావు, ప్రసాద్‌, ఎస్‌ఐ చంద్రబాబు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాదారులను వెనక్కి పంపారు. ఉదయం రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు జరిమానా విధించారు. 

Read more