మంత్రాలయంలో క్షుద్రపూజల కలకలం
ABN , First Publish Date - 2020-11-13T06:02:06+05:30 IST
జడ్పీ ఉన్నత పాఠశాల్లో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి.
- తల్లిదండ్రుల ఆందోళన
మంత్రాలయం, నవంబరు 12: జడ్పీ ఉన్నత పాఠశాల్లో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. గురువారం ఉదయం విద్యార్థులు పాఠశాలకు వెళ్లగా ఆవరణంలో ముగ్గులు, పసుపు, కుంకుమ, రక్తం మరకలు కనిపించాయి. దీంతో విద్యార్థులు భయ భ్రాంతులకు గురయ్యారు. పోలీసులు చేరుకుని విచారణ చేశారు.