బస్తిపాడులో వ్యక్తి హత్య

ABN , First Publish Date - 2020-11-25T06:15:49+05:30 IST

ఉలిందకొండ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని బస్తిపాడు గ్రామం లో దస్తగిరి (50) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.

బస్తిపాడులో వ్యక్తి హత్య

కర్నూలు, నవంబరు 24: ఉలిందకొండ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని బస్తిపాడు గ్రామం లో దస్తగిరి (50) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. మంగళవారం ఆయన   హోటల్‌లో టీ తాగుతుండగా  మిన్నెల్ల వచ్చి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దస్తగిరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.   ఎస్‌ఐ శరత్‌కుమార్‌ రెడ్డి తెలిపిన వివరాల మేరకు మిన్నెల్ల, దస్తగిరి కూలీ పని చేసుకొని జీవిస్తున్నారు. మూడేళ్ల కింద వీరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో మిన్నెల్ల కొడవలితో తలపై నరికాడు. దీంతో దస్తగిరి  అక్కడికక్కడే కూలపడిపోయాడు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శరత్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. 

Read more