ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-11-20T05:25:36+05:30 IST

డోన్‌ మండలం కనపకుంట గ్రామానికి చెందిన మద్దిలేటి(45) ప్రమాదవశాత్తు కింద పడి గురువారం మృతి చెందాడు.

ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి

డోన్‌(రూరల్‌), నవంబరు 19: డోన్‌ మండలం కనపకుంట గ్రామానికి చెందిన మద్దిలేటి(45) ప్రమాదవశాత్తు కింద పడి గురువారం మృతి చెందాడు. మద్దిలేటి లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పట్టణంలోని ఇందిరానగర్‌ జాడీల ఫ్యాక్టరీ వద్ద బంధువుల ఇంటి వద్దకు వచ్చి మెట్లు దిగుతూ కాలుజారి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కొడుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-11-20T05:25:36+05:30 IST