మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-14T05:19:48+05:30 IST
కుటుంబ సమస్యలతో లక్ష్మీభాయి (55) అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు జొన్నగిరి ఎస్‌ఐ సురేష్ ఆదివారం తెలిపారు.

తుగ్గలి, డిసెంబరు 13: కుటుంబ సమస్యలతో లక్ష్మీభాయి (55) అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు జొన్నగిరి ఎస్‌ఐ సురేష్ ఆదివారం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని మీటేతండాకు చెందిన సూర్యనారాయణ భార్య లక్ష్మీభాయి ఎవరు లేని సమయంలో పొలానికి పిచికారీ చేసేందుకు తెచ్చిన మందును తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమెను హుటాహుటిన వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.