లాక్‌డౌన్‌ తప్పక పాటించాలి: ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2020-04-15T10:41:40+05:30 IST

మే నెల 3వ తేదీ వరకు అందరూ తప్పక లాక్‌డౌన్‌ పాటించాలని ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

లాక్‌డౌన్‌ తప్పక పాటించాలి: ఎమ్మెల్సీ

అవుకు, ఏప్రిల్‌ 14: మే నెల 3వ తేదీ వరకు అందరూ తప్పక లాక్‌డౌన్‌ పాటించాలని ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం అవుకు పట్టణంలోని చల్లా భవన్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. చల్లా మాట్లాడుతూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న వైద్య సిబ్బంది, పోలీస్‌శాఖ, పారిశుధ్య సిబ్బందికి రుణపడి ఉంటామన్నారు. ప్రజలు బయట తిరగవద్దని కోరారు.

Updated Date - 2020-04-15T10:41:40+05:30 IST