-
-
Home » Andhra Pradesh » Kurnool » Local Elections
-
ఖర్చు పరిమితి మించితే చర్యలు
ABN , First Publish Date - 2020-03-13T11:50:31+05:30 IST
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచే ఆయా అభ్యర్థులు వ్యయ నిబంధనలకు లోబడి ఖర్చు చేయాలని, పరిమితే దాటితే చర్యలు తీసుకుంటామని ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎం.శివప్రసాద్ హెచ్చరించారు.

జడ్పీటీసీ స్థానానికి రూ.4 లక్షలు, ఎంపీటీసీకి రూ. 2 లక్షలు దాటకూడదు
ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎం.శివప్రసాద్
కర్నూలు(కలెక్టరేట్) మార్చి 12: స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచే ఆయా అభ్యర్థులు వ్యయ నిబంధనలకు లోబడి ఖర్చు చేయాలని, పరిమితే దాటితే చర్యలు తీసుకుంటామని ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎం.శివప్రసాద్ హెచ్చరించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఎన్నికల వ్యయ నిబంధనలపై ప్రకటన జారీ చేశారు. జడ్పీటీసీ స్థానానికి రూ.4 లక్షలు, ఎంపీటీసీ స్థానానికి రూ.2 లక్షలకు మించి ఖర్చు చేయకూదన్నారు. అలాగే నగరపాలక సంస్థ పరిధిలో వార్డు మెంబర్ రూ.2 లక్షలు, మున్సిపాలిటీ పరిధిలో వార్డు మెంబర్ అయితే రూ.1.5 లక్షలు, నగర పంచాయతీ వార్డు మెంబర్ రూ. లక్షకు మించి ఖర్చు చేయకూదన్నారు. సర్పంచ్ అభ్యర్థి రూ.2.5 లక్షలు, పది వేల జనాభా కన్నా తక్కువ ఉన్న గ్రామాల్లో రూ.1.5 లక్షలు, గ్రామాల్లో వార్డు మెంబరు రూ.50 వేలు, పదివేల కన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లోని వార్డు మెంబర్ రూ.30 వేలు మించి ఎన్నికల ఖర్చు చేయకూడదన్నారు.
జిల్లాలోని అన్ని మండలాల్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో సహాయ ఎన్నికల వ్య అధికారులు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఎన్నికల ఖర్చుపై స్వీకరించిన ఫిర్యాదులు వెంటనే పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఇతర వివరాలకు ఎన్నికల వ్యయానికి సంబంధించిన నోడల్ అధికారి మొబైల్ నెంబర్ 9848779534, ఇ-మెయిల్ ఐడీ ఛ్చీౌట్చజుుఽజూఃజఝ్చజీజూ.ఛిౌఝ ను సంప్రదించాలన్నారు. అంతకు ముందు కర్నూలు జిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకుడు, సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి ఎం.శివప్రసాద్‌కు కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లు, పటిష్ఠమైన బందోబస్తు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, తదితర వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలకుడికి కలెక్టర్, ఎస్పీలు తెలిపారు. వ్యయ పరిశీలకుడికి స్వాగతం పలికిన వారిలో డీఆర్వో పుల్లయ్య, డీసీవో రామాంజనేయులు, సీపీవో అశోక్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం వ్యయ పరిశీలకులు ఎం.శివప్రసాద్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎన్నికల కంట్రోల్ రూంను పరిశీలించి సిబ్బందితో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, బుధవారపేట మున్సిపల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు.