గ్రంథాలయ వారోత్సవాలు
ABN , First Publish Date - 2020-11-16T05:22:01+05:30 IST
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని గ్రంథాలయ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. గ్రంథాల వారోత్సవాలలో భాగంగా గోస్పాడులో ఉన్న గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు.

గోస్పాడు, నవంబరు 15: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని గ్రంథాలయ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. గ్రంథాల వారోత్సవాలలో భాగంగా గోస్పాడులో ఉన్న గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు.
బండి ఆత్మకూరు: ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవ ర్చుకోవాలని గ్రంథాలయ అధికారి మధు సూచించారు. బండిఆత్మకూరులో ఆదివారం గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పుస్తక పఠనం నిర్వహించారు. గ్రామంలోని విద్యార్థులు, విద్యావంతులు ఈ కార్యక్రమానికి హాజరై పుస్తక ప్రదర్శనను తిలకించారు.
సంజామల: విద్యార్థులు పుస్తకపఠనం అలవరుచుకోవాలని సంజామల శాఖ గ్రంథాలయాధికారి బాలతిమ్మారెడ్డి సూచించారు. 53వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం సంజామల, గిద్దలూరు గ్రంథాలయాల్లో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. గిద్దలూరు పుస్తక నిక్షిప్త కేంద్రం నిర్వాహకుడు మద్దిలేటి, రిటైర్డ్ తెలుగు పండిట్ చెన్నకేశవశాస్ర్తి పాల్గొన్నారు.
ఉయ్యాలవాడ: విజ్ఞానాన్ని పెంచే భాండాగారం గ్రంథాలయం అని గ్రంథాలయ అధికారి అరుణ తెలిపారు. 53వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో శనివారం పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. గ్రంథాలయ నిర్వాహకుడు రంగయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.