-
-
Home » Andhra Pradesh » Kurnool » Lets celebrate modestly
-
నిరాడంబరంగా ఉత్సవాలు జరుపుకుందాం
ABN , First Publish Date - 2020-08-20T11:18:45+05:30 IST
గత 36 సంవత్సరాలుగా జిల్లాలో గణేష్ ఉత్సవాలను ఎంతో ఆర్బాటంగా నిర్వహిస్తూ వచ్చామని, కరోనా కారణంగా ఈ ఏడాది నిరాడంబరం

గణేష్ ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు
ఆదోని టౌన్, ఆగస్టు 19: గత 36 సంవత్సరాలుగా జిల్లాలో గణేష్ ఉత్సవాలను ఎంతో ఆర్బాటంగా నిర్వహిస్తూ వచ్చామని, కరోనా కారణంగా ఈ ఏడాది నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించామని ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు కపిలేశ్వరయ్య అన్నారు.
బుధవారం విశ్వహిందూపరిషత్ కార్యాలయంలో కమిటీ జిల్లా కార్యదర్శి కునిగిరి నీలకంఠ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్సవ కమిటీ నిబంధనల మేరకు వినాయక మిత్రమండలి వారు వినాయక విగ్రహాల ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనుమతి తీసుకొని దేవాలయాలు, ఫంక్షన్‌హాల్స్, అపార్ట్‌మెంట్లలో రెండు అడుగుల ఎత్తు మించని వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలని అన్నారు.