ప్రియుడి ఇంటి ముందు ధర్నా

ABN , First Publish Date - 2020-11-06T06:18:14+05:30 IST

youthi darna

ప్రియుడి ఇంటి ముందు ధర్నా

 మద్దతుగా మహిళా సంఘాలు

 దేవనకొండ, నవంబరు 5: మండలంలోని ఓ గ్రామంలో గురువారం ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి ఆందోళనకు దిగింది. గత రెండేళ్లుగా  మరో గ్రామానికి చెందిన ఓ యువకుడు, ఈ యువతి ప్రేమించుకుం టున్నారు. అప్పట్లో మైనార్టీ తీరాక పెళ్లి చేసేలా ఏప్రిల్‌ నెలలో  పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఈ మేరకు యువతి తల్లిదరండులు అమ్మాయికి మైనార్టీ తీరిందని పెళ్లి చేసుకోవాలని గ్రామపెద్దల సమక్షంలో అడిగారు. కానీ  అబ్బాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో యువతి పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకుంది. ఆమె తల్లిదరండులు పత్తికొండ పోలీ్‌సస్టేషన్‌ను ఆశ్రయించారు. పత్తికొండ సీఐ సమక్షంలో అబ్బాయి తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించ లేదు.  సీఐ రెండు రోజుల్లో న్యాయం చేస్తానని యువతికి హామీ ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో  బుధవారం రాత్రి నుంచి అబ్బాయి ఇంటి వద్ద నిరాహార దీక్ష చేస్తోంది. మహిళా సంఘాల నాయకులు లు మద్దతుగా  నిరాహార దీక్షలో పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-06T06:18:14+05:30 IST