‘సాగుదారుల సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి’

ABN , First Publish Date - 2020-09-18T11:19:07+05:30 IST

రైతులు స్వయం సహాయక సాగుదారుల సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని ఏవో రాజకిశోర్‌ సూచించారు. గురువారం ఏవో కార్యాలయంలో రైతులతో

‘సాగుదారుల సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి’

గోనెగండ్ల, సెప్టెంబరు 17: రైతులు స్వయం సహాయక సాగుదారుల సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని ఏవో రాజకిశోర్‌ సూచించారు. గురువారం ఏవో కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. భూమిలేని సాగుదారులు, చిన్న, సన్న కారురైతులు, డీ పట్టా ఉన్న రైతులు, అటవీ ప్రాంతాల్లో పంటలను సాగుచేసే రైతులు ఐదు నుంచి పది మంది ఒక గ్రూపూపుగా ఏర్పడి, ఉమ్మడి బ్యాంకు ఖాతా ప్రారంభించాలని అన్నారు.


ఒకరు కన్వీనర్‌, మరోకరు కో కన్వీనర్‌గా ఉండాలని సూచించారు. ప్రతి సభ్యుడు రూ. 100 సభ్యత్వ రుసుం చెల్లించాలని, సభ్యులు నెలకు రూ.500 ఖాతాలో జమ చేయాలని తెలిపారు. దీంతో తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, పంట నష్టపరిహారం ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారి హరిప్రసాద్‌, రైతులు, ఎంపీఈవోలు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-18T11:19:07+05:30 IST