జాతీయ స్థాయికి కేవీఆర్‌ ఉపాధ్యాయిని

ABN , First Publish Date - 2020-03-19T11:29:00+05:30 IST

జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయినిగా డాక్టర్‌ దండే స్వప్న ఎంపిక కావడం అభినందనీయమని కేవీఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా. సీవీ. రాజేశ్వరి అన్నారు.

జాతీయ స్థాయికి కేవీఆర్‌ ఉపాధ్యాయిని

డా. దండే స్వప్న  అభినందన సభ


కర్నూలు(అర్బన్‌), మార్చి 18: జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయినిగా డాక్టర్‌ దండే స్వప్న ఎంపిక కావడం అభినందనీయమని కేవీఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా. సీవీ. రాజేశ్వరి  అన్నారు. బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆమె మాట్లాడారు. కళాశాల నుంచి జాతీయ స్థాయిలో స్వప్న ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమన్నారు.  విదార్థులు   ఇలాంటి అధ్యాపకులను ఆదర్శంగా తీసుకుని మంచి చదువులు చదువుకుని     రాణించి కళాశాల పేరు ప్రఖ్యాతులను మరింత విస్తరింపజేయాలని అన్నారు.    అనంతరం కళాశాల విద్యార్థినిలు, ఆధ్యాపకులు స్వప్నను శాలువాతో సన్మానించారు.

Updated Date - 2020-03-19T11:29:00+05:30 IST