ఘాట్ల వద్ద బందోబస్తు: ఎస్పీ

ABN , First Publish Date - 2020-11-26T06:10:30+05:30 IST

తుంగభద్ర పుష్కరాలను పురస్కరించుకుని అన్ని ఘాట్ల వద్ద పకడ్బందీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఫక్కీరప్ప పేర్కొన్నారు.

ఘాట్ల వద్ద బందోబస్తు: ఎస్పీ
సంగమేశ్వరంలో ఎస్పీ ఫక్కీరప్ప పూజలు

ఆత్మకూరు, నవంబరు 25: తుంగభద్ర పుష్కరాలను పురస్కరించుకుని అన్ని ఘాట్ల వద్ద పకడ్బందీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఫక్కీరప్ప పేర్కొన్నారు. బుధవారం సప్తనదీ సంగమేశ్వర క్షేత్రంలోని పుష్కర ఘాట్లను ఆయన సందర్శించారు. ముందుగా పుష్కరజలాలకు పూజలు చేసి ఆ తర్వాత తలపై చల్లుకుని సంప్రోక్షణ పొందారు. తదుపరి శ్రీదేవీభూదేవి సహిత శ్రీవెంక టేశ్వరస్వామివార్ల ఉత్సవ మూరు ్తలకు పుష్కరజలాలచే అభిషేకించా రు. అనంతరం ఎగువ ఉమా మహేశ్వరాలయంలో పరివార దేవతల  పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫక్కిరప్ప మాట్లాడుతూ.. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన సుమారు 5వేల మంది పోలీసులు తుంగభద్ర పుష్కరాల్లో బందోబస్తు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 23 పుష్కర ఘాట్ల వద్ద డీఎస్పీ, సీఐ స్థాయి అధికారులను ఇన్‌చార్జ్జిలుగా నియమించినట్లు తెలిపారు. ఆయన వెంట ఏఎస్పీ హనుమంతు, ఆత్మకూరు డీఎస్పీ శృతి, సీఐ బీఆర్‌ కృష్ణయ్య, ఎస్సై నవీన్‌బాబు తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-11-26T06:10:30+05:30 IST