వాగులు దాటేటప్పుడు జాగ్రత్త

ABN , First Publish Date - 2020-08-11T17:56:03+05:30 IST

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని..

వాగులు దాటేటప్పుడు జాగ్రత్త

ప్రజలకు ఎస్పీ ఫక్కీరప్ప సూచన


కర్నూలు(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, వాటిని దాటేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్టును సోమవారం ఆయన సందర్శించారు. వరద ఉధృతి ఎక్కువైతే లోతట్టు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖ అధికారులతో చర్చించామని తెలిపారు. గాజులదిన్నె నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారని, ప్రాజెక్టుకు 6 వేల క్యూసెక్కుల నీరు చేరుతోందని తెలిపారు.


హంద్రీ నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రవాహాన్ని చూసేందుకు వచ్చేవారు జాగ్రత్తలు పాటించాలని కోరారు. సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారని, వీటి నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించామని తెలిపారు. ఎస్పీ వెంట ట్రైనీ డీఎస్పీ భవ్య కిషోర్‌, గోనెగండ్ల ఎస్‌ఐ హనుమంత రెడ్డి, ఆదోని ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ భాస్కర్‌ రెడ్డి, ప్రాజెక్టు జేఈ రవి ప్రసాద్‌, కోడుమూరు జేఈ పరమేశ్వర్లు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-08-11T17:56:03+05:30 IST