ఆ వ్యక్తికి కరోనా సోకలేదు

ABN , First Publish Date - 2020-03-18T11:27:51+05:30 IST

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరిన మూడో కరోనా అనుమానిత కేసులో నెగిటివ్‌ ఫలితం వచ్చిందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.జీఎ్‌స.రాంప్రసాద్‌ వెల్లడించారు.

ఆ వ్యక్తికి కరోనా సోకలేదు

విదేశాల నుంచి వచ్చిన వారు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి

డా. జీఎ్‌స.రాంప్రసాద్‌


కర్నూలు(హాస్పిటల్‌), మార్చి 17: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరిన మూడో  కరోనా అనుమానిత కేసులో  నెగిటివ్‌ ఫలితం వచ్చిందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.జీఎ్‌స.రాంప్రసాద్‌ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం   ఆయన తన చాంబర్‌లో కరోనా నోడల్‌ ఆఫీసర్‌ డా.శైలజ, మెడిసిన్‌ ఇన్‌చార్జి హెచ్‌వోడీ డా.ఎం.రంగనాథ్‌, ఫల్మనాలజిస్టు డా.నాగశ్రీధర్‌తో కలిసి విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 


  కరోనా సోకిందనే అనుమానం ఉన్న మూడో వ్యక్తి నమూనాలను తిరుపతి స్విమ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని వైరాలజీ విభాగానికి పంపగా నెగెటివ్‌ నివేదిక  వచ్చిందన్నారు. దీంతో ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశామని,  14 రోజులు హోం ఐసోలేషన్‌లో ఉంచుతామని అన్నారు. సోషల్‌ మీడియాలో   కరోనాపై వచ్చే వదంతులు నమ్మవద్దని, విదేశాలకు   వెళ్లి వచ్చిన వారికి    జలుబు, దగ్గు, ఆయాసం ఉంటే  ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని సూచించారు.  వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.   


Updated Date - 2020-03-18T11:27:51+05:30 IST