ఇరాన్ సదస్సుకు కర్నూలు వైద్యుడు
ABN , First Publish Date - 2020-03-02T11:18:55+05:30 IST
డాక్టర్ అబ్దుల్ హక్ యునానీ మెడికల్ కాలేజీ క్లీనికల్ రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ మంచాల రమేష్ ఇరాన్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు ఎంపికయ్యారు.

కర్నూలు(హాస్పిటల్), మార్చి 1: డాక్టర్ అబ్దుల్ హక్ యునానీ మెడికల్ కాలేజీ క్లీనికల్ రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ మంచాల రమేష్ ఇరాన్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు ఎంపికయ్యారు. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు జరిగే మొదటి ఇండియా-ఇరాన్ యునాని సదస్సుకు హాజరు కావాలని డాక్టర్ రమేష్‌కు ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ రీసెర్చ్ ఫర్ యునాని మెడికల్ నుంచి ఆహ్వానం అందింది. అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైన ఆయనను యునాని మెడికల్ కాలేజ్ వైద్యులు అభినందించారు.