పెద్దాసుపత్రి ఇక నాన్‌ కొవిడ్‌

ABN , First Publish Date - 2020-12-22T05:49:32+05:30 IST

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రి జాబితా నుంచి తొలగిస్తూ వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అశోక్‌ కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వు లు జారీ చేశారు

పెద్దాసుపత్రి ఇక నాన్‌ కొవిడ్‌

  1. కొవిడ్‌ జాబితా నుంచి తొలగింపు
  2. పెద్దాసుపత్రికి సడలింపు ఇచ్చిన ప్రభుత్వం
  3. గత నాలుగు వారాల్లో తగ్గిన కరోనా కేసులు


కర్నూలు(హాస్పిటల్‌), డిసెంబరు 21: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రి జాబితా నుంచి తొలగిస్తూ వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అశోక్‌ కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వు లు జారీ చేశారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కర్నూలు ప్రభుత్వ ఆసుప త్రిని ఏప్రిల్‌ 20న స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రిగా ప్రకటించింది. ఆ సమయంలో జిల్లా 184 కేసులతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం 60,498 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇందులో 59,889 మంది డిశ్చార్జి కాగా.. 122 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 487 మంది కరోనాతో మృతి చెందారు. నాలుగు వారాలుగా జిల్లాలో కేసులు తగ్గుముఖం పట్టడంతో స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రి జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి సాధారణ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. 


కొవిడ్‌కు కొన్ని పడకల కేటాయింపు

స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రిగా సడలింపు ఇచ్చినా కొన్ని పడకలను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కేసులు పెరిగితే సద్వినియోగం చేసుకోవాలని ఆదేశాలు జారీ ఇచ్చింది. ప్రస్తుతం జీజీహెచ్‌లో 20 కొవిడ్‌ కేసులు ఉండగా నాన్‌ కొవిడ్‌ కేసులు 900 దాకా ఉన్నాయి. 

స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రి నుంచి కర్నూలు జీజీహెచ్‌ను తొలగిస్తున్నట్లు తమకు  సమాచారం అందలేదని సూపరింటెండెంట్‌ డా.జీఎస్‌ నరేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.


వ్యాక్సిన్‌పై శిక్షణ ఇవ్వండి: కలెక్టర్‌ 

 కర్నూలు, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై వ్యాక్సినేటర్లకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ అధికారులతో సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఉన్న వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది వివరాలను వెంటనే నమోదు చేయాలన్నారు. జిల్లాలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద చేపట్టిన నియామకాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. వ్యాక్సిన్‌ వేయడానికి సెషన్‌ సైట్లు గుర్తించి ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. జేసీలు రాంసుందర్‌రెడ్డి, సయ్యద్‌ ఖాజామొహిద్దీన్‌, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీ, ట్రైనీ కలెక్టర్‌ నిధి మీనా, డీఎంహెచ్‌వో రామగిడ్డయ్య  పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-22T05:49:32+05:30 IST