కర్నూలు-డోన్‌ జాతీయ రహదారిపై ఘోరం

ABN , First Publish Date - 2020-10-14T19:40:32+05:30 IST

కర్నూలు-డోన్‌ జాతీయ రహదారిపై పెద్ద టేకూరు వద్ద సోమవారం అర్ధరాత్రి దాటిన..

కర్నూలు-డోన్‌ జాతీయ రహదారిపై ఘోరం

అదుపు తప్పి డివైడర్‌ దాటిన కారు 

ఎదురుగా వస్తూ ఢీకొట్టిన లారీ

ప్రాణాలు కోల్పోయిన స్నేహితులు

మరో ప్రమాదంలో మహిళ మృతి


కర్నూలు: కర్నూలు-డోన్‌ జాతీయ రహదారిపై పెద్ద టేకూరు వద్ద సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటి గంట ప్రాంతంలో ఘోర రోడు ్డప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్‌ దాటి కుడి వైపు రోడ్డుపైకి దూసుకువెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. దీంతో కారు లో ఉన్న సుజీత్‌ కుమార్‌ (40), గోవర్ధన్‌ రెడ్డి (40) అక్క డికక్కడే మృతి చెందారు. విషయం తెలియగానే ఉలింద కొండ ఎస్‌ఐ శరత్‌ కుమార్‌ రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు, లారీ రోడ్డు దాటి పక్కనే ఉన్న లోతైన ప్రదేశంలో పడిపోయాయి.


ఇద్దరు మిత్రులు..

కర్నూలు జిల్లా సుంకేసులకు చెందిన సుజీత్‌ కుమార్‌ అనంతపురంలో స్థిరపడ్డాడు. అగ్రోటెక్‌ ఎరువుల వ్యాపారం చేస్తున్నాడు. గోవర్ధన్‌ రెడ్డికి వేప పిండి మిషన్‌ ఉంది. ఇద్దరూ స్నేహితులు. సుజీత్‌ ఇటీవల కర్నూలులో స్థలం కొనుగోలు చేశాడు. రిజిస్ర్టేషన్‌ కోసం స్నేహితుడు గోవర్ధన్‌రెడ్డితో కలిసి సోమవారం మధ్యాహ్నం కర్నూలుకు కారులో వచ్చాడు. పని ముగించుకుని అర్ధరాత్రి సమయంలో తిరుగు ప్రయాణం ప్రారంభించారు. వీరి కారు పెద్ద టేకూరు సమీపించగానే ప్రమాదవశాత్తు అదుపు తప్పింది. డివై డర్‌ను దాటుకుని కుడివైపున రోడ్డు మీద వెళ్లి ఆగిపోయింది. అంతలో డోన్‌ వైపు నుంచి వస్తున్న లారీ వీరి కారును ఢీ కొట్టింది. ప్రమా దంలో కారు నుజ్జునుజ్జయింది. స్నేహితులు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువులకు సమాచారం ఇచ్చి పిలిపించారు. గోవర్ధన్‌ రెడ్డిది అనంతపురం జిల్లా కదిరి మండలం ఈరేపలల్లి గ్రామం. ఆయనకు  భార్య చంద్రకళ, కొడుకు, కూతురు ఉన్నారు. ప్ర స్తుతం అనంతపురంలో నివాసం ఉంటున్నారు. సుజీత్‌ కుమా ర్‌కు భార్య అనిత, కొడుకు, కూతురు ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శరత్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

 

గుర్తు తెలియని మహిళ..

కర్నూలు నగర శివారులోని హైదరాబాదు రహదారిలో బాలాజీ నగర్‌ వద్ద లారీ ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందారు. ఆమె మృతదేహం గుర్తు పట్టలేనంతగా ఛిద్రమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ట్రాఫిక్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె వయసు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. సంతోష్‌ నగర్‌ వైపు నుంచి బాలాజీ నగర్‌ వైపు రోడ్డు దాటుతుండగా కేఏ 40 ఏ 2986 నెంబరు లారీ ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ పారిపోయాడని స్థానికులు చెబుతున్నారు. ఆ మహిళ యాచించి బతికేదని స్థానికులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


Updated Date - 2020-10-14T19:40:32+05:30 IST