-
-
Home » Andhra Pradesh » Kurnool » Kurnool crime news
-
తంగడంచలో క్షుద్రపూజల కలకలం
ABN , First Publish Date - 2020-11-22T05:29:58+05:30 IST
మండలంలోని తంగడంచ గ్రామ సమీపంలోని పొలాలు, తంగడంచ చెరువు కట్టపై గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమలతో భయంకరమైన రూపాలతో క్షుద్రపూజలు చేయడంతో కలకలం రేపుతోంది.

జూపాడుబంగ్లా, నవంబరు 21: మండలంలోని తంగడంచ గ్రామ సమీపంలోని పొలాలు, తంగడంచ చెరువు కట్టపై గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమలతో భయంకరమైన రూపాలతో క్షుద్రపూజలు చేయడంతో కలకలం రేపుతోంది. వారం రోజుల నుంచి పొలాల్లో ఎక్కడపడితే అక్కడ రాత్రిపూట క్షుద్ర పూజలు చేస్తున్నారని చేసి పోతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.