98 శాతం పనులు పూర్తి

ABN , First Publish Date - 2020-12-11T05:42:25+05:30 IST

ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు పనులు 98 శాతం పూర్తయ్యాయని కలెక్టర్‌ వీర పాండియన్‌ తెలిపారు.

98 శాతం పనులు పూర్తి
పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌

  1. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును తనిఖీ చేసిన కలెక్టర్‌ 


ఓర్వకల్లు, డిసెంబరు 10: ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు పనులు 98 శాతం పూర్తయ్యాయని కలెక్టర్‌ వీర పాండియన్‌ తెలిపారు. గురువారం ఆయన పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎయిర్‌పోర్టులో పెండింగ్‌లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ కైలాష్‌ మాండల్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ వీర పాండియన్‌ మాట్లాడుతూ ఎయిర్‌పోర్టులో అన్ని పనులు పూర్తయితే వారం రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. కమర్షియల్‌ ఫ్లైట్‌ ఆపరేషన్స్‌కు అనుమతులు పైనలైజ్‌ అయిన వెంటనే ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు ఎయిర్‌పోర్టులో రన్‌వే, ఏటీసీ టవర్‌, పీటీపీ బిల్డింగ్‌, యాంటీ వైజాగ్‌ రూం, ఐసొలేషన్‌ బెడ్స్‌, భద్రత తనిఖీ ప్రాంతం, స్టాండింగ్‌ సెంటర్‌, డ్రింకింగ్‌ వాటర్‌, వాష్‌రూమ్స్‌, వీఐపీ ల్యాండ్స్‌,  ఎలక్ర్టికల్‌ రూమ్స్‌, ఎమర్జెన్సీ, ఎగ్జిట్‌, సెక్యూరీటీ ఆఫీస్‌, సీసీ కెమెరాల పనితీరును కలెక్టర్‌ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన వెంట డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు, ఎయిర్‌పోర్టు ఈఈ ప్రసాద్‌, ఆర్డీవో వెంకటేశం, తహసీల్దార్‌ శివరాముడు, జిల్లా అధికారులు, ఎయిర్‌పోర్టు అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-11T05:42:25+05:30 IST