పుష్కరాల బడ్జెట్‌ను మళ్లీ పంపండి: కలెక్టర్

ABN , First Publish Date - 2020-09-20T17:25:43+05:30 IST

జిల్లాలో నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు నిర్వహించే తుంగభద్ర పుష్కరాలకు..

పుష్కరాల బడ్జెట్‌ను మళ్లీ పంపండి: కలెక్టర్

‌కర్నూలు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు నిర్వహించే తుంగభద్ర పుష్కరాలకు మొదటి, రెండో ప్రాధాన్యాల కింద పంపిన బడ్జెట్‌ ప్రతిపాదనలను పునఃపరిశీలించి మళ్లీ పంపాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ నెల 17వ తేదీన జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిర్వహిం చిన వీడియో కాన్ఫరెన్స్‌లో మరిన్ని పుష్కర ఘాట్లను నిర్మించాలని జిల్లా ప్రజాప్రతినిధులు కోరారని, దీంతో బడ్జెట్‌ ప్రతిపాదనలను సవరించి సోమవారం సాయంత్రంలోపు పంపాలని కోరారు. గతంలో ఉన్న 17 ఘాట్లకు అదనంగా మరో 11 నిర్మించాలన్నారు. ప్రతి పనినీ టెండర్‌ విధానంలో చేపట్టాలని సూచించారు. పంచాయతీ రాజ్‌, ఇరిగేషన్‌, ఆర్‌ అండ్‌ బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు శాఖలు సమన్వయంతో పనులను చేపట్టాలన్నారు. జేసీ రవిపట్టన్‌ షెట్టి, నగరపాలక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీ, పుష్కర కమిటీల నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-20T17:25:43+05:30 IST