జగన్ కాన్వాయ్‌ను అడ్డుకుంటాం: బైరెడ్డి శబరి

ABN , First Publish Date - 2020-11-19T19:59:54+05:30 IST

తుంగభద్ర పుష్కరాలలో పుష్కర స్నానాలను రద్దు చేయడం బాధాకరమని బీజేపీ నేత బైరెడ్డి శబరి అన్నారు.

జగన్ కాన్వాయ్‌ను అడ్డుకుంటాం: బైరెడ్డి శబరి

కర్నూలు: తుంగభద్ర పుష్కరాలలో పుష్కర స్నానాలను రద్దు చేయడం బాధాకరమని బీజేపీ నేత బైరెడ్డి శబరి అన్నారు.  కర్నూలు వస్తున్న ముఖ్యమంత్రి జగన్ కాన్వాయిని తప్పకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు పాదయాత్రలు, బహిరంగ సభలు పెట్టుకున్నప్పుడు కానరాని కరోనా తుంగభద్రనదిలో స్నానాలు చేస్తే వస్తుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా వ్యవహరిస్తోందని బైరెడ్డి శబరి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-11-19T19:59:54+05:30 IST