కర్నూలుకు ‘నివర్’ తుపాన్ ముప్పు

ABN , First Publish Date - 2020-11-25T16:21:08+05:30 IST

జిల్లాకు “నివర్’’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. దీంతో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప పోలీసు

కర్నూలుకు ‘నివర్’ తుపాన్ ముప్పు

కర్నూలు: జిల్లాకు  “నివర్’’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. దీంతో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పుష్కరాల విధుల్లో  ఉన్న పోలీసులకు పలు సూచనలు జారీ చేశారు. నదులలో అనధికారికంగా బోట్లు( పడవలు) నడుపుతుంటే వెంటనే ఆపాలని ఆదేశించారు. సీడీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. తుంగభద్రనది పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 

Read more