కాలనీలోకి దూసుకెళ్లిన లారీ
ABN , First Publish Date - 2020-11-13T05:30:00+05:30 IST
గడివేములలోని ఏబీఎం చర్చి మలుపు వద్ద శుక్రవారం రాత్రి లారీ అదుపు తప్పి కాలనీలోకి దూసుకెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గడివేముల, నవంబరు 13: గడివేములలోని ఏబీఎం చర్చి మలుపు వద్ద శుక్రవారం రాత్రి లారీ అదుపు తప్పి కాలనీలోకి దూసుకెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నందికొట్కూరు నుంచి వస్తున్న లారీ గడివేములలోని ఏబీఎం చర్చి మలుపు వద్ద అదుపు తప్పింది. డ్రైవర్ వాహన వేగాన్ని నియంత్రించలేక పోవడంతో వాహనం కాలనీలోకి దూసుకెళ్లింది. సొసైటీ అధ్యక్షుడు ఆర్‌బీ చంద్రశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి కాలనీ వాసులతో మాట్లాడారు. గతంలో కూడా భారీ వాహనాలు అతివేగంతో రావడంతో ముగ్గురు మృతిచెందారని, భారీ వాహనాల రాకపోకలను గడివేముల మీదుగా నియంత్రించాలని డిమాండ్ చేశారు.