పుష్కరాలు ఇలానా జరిపేది?
ABN , First Publish Date - 2020-11-26T05:49:40+05:30 IST
తుంగభద్ర పుష్కర వేడుకలను ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసిందని, కనీస ఏర్పాట్లు లేకుండా ఇలానా జరిపేది? అని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు.

- నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వానికి తగదు
- కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ధ్వజం
డోన్, నవంబరు 25: తుంగభద్ర పుష్కర వేడుకలను ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసిందని, కనీస ఏర్పాట్లు లేకుండా ఇలానా జరిపేది? అని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం డోన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తుంగభద్ర పుష్కరాలకు రూ.240 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం చెబుతోందని, ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇసుక ధరలు ఇష్టారాజ్యంగా పెంచేసి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని పోగొట్టుకుని తప్పు చేశామనే భావనలో ఉన్నారన్నారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ లక్కసాగరం లక్ష్మీరెడ్డి, టీడీపీ నాయకులు భాస్కర్‌నాయుడు, ఓబులాపురం శేషిరెడ్డి, దశరథరామిరెడ్డి, శివ, రవి, ఖాజా, కరేపాకు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.