కొలను భారతిలో పూజలు

ABN , First Publish Date - 2020-12-12T05:07:47+05:30 IST

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కొత్తపల్లి మండలంలోని కొలను భారతి క్షేత్రంలో సరస్వతి అమ్మవారికి శుక్రవారం ఆలయ పురోహితుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు.

కొలను భారతిలో పూజలు
సప్త శివాలయాల వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగిస్తున్న దృశ్యం

కొత్తపల్లి, డిసెంబరు 11: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కొత్తపల్లి మండలంలోని కొలను భారతి క్షేత్రంలో సరస్వతి అమ్మవారికి శుక్రవారం ఆలయ పురోహితుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. కార్తీక మాసం చివరి శుక్రవారం కావడంతో పురోహితులు అమ్మవారికి అభిషేక క్రతువులు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరణ గావించారు. అనంతరం కుంకుమార్చన, పుణ్యావచనం, పుష్పార్చన, మహామంగళహారతి, తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో 22 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. అలాగే సప్త శివాలయాల్లో మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చన, పుష్పార్చన, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శివాలయాల ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. వాసవీ సత్ర నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - 2020-12-12T05:07:47+05:30 IST