మంత్రుల ఇళ్ల ముందు ధర్నా చేయాలి

ABN , First Publish Date - 2020-11-03T10:18:40+05:30 IST

జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్ల వద్ద ధర్నాలు చేయాలని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

మంత్రుల ఇళ్ల ముందు ధర్నా చేయాలి

 పోలవరం  కోసం ఒత్తిడి తేవాలి

 పుష్కర పనుల్లో అవినీతి ఏరులై పారుతోంది

 సోమిశెట్టి వెంకటేశ్వర్లు


కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 2: జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్ల వద్ద ధర్నాలు చేయాలని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మాట్లా డుతూ  కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయిస్తున్న నిధులను కుదించినా, అదేవిధంగా నిర్మాణంలో నిధుల కోత విధించినా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నోరు మెదపలేని స్థితిలో ఉండిపోయారని ఆరోపించారు. తనపై  పెట్టిన  సీబీఐ కేసులను మాఫీ చేయించుకోవడానికే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.  చంద్రబాబు నాయుడు తన హయాంలోనే 73 శాతం ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేశారని, అయితే జగన్‌ సీఎం అయ్యాక పనులు ఆగిపోయాయని అన్నారు.   


పుష్కర ఘాట్ల పనుల్లో అవినీతి ప్రవాహం

 తుంగభద్ర పుష్కర ఘాట్లతో పాటు రోడ్లు, తదితర పనుల కోసం వందల కోట్లు కేటాయించామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని, అది నిజం కాదని సోమిశెట్టి ఆరోపించారు.  రూ. 22 కోట్లతో జిల్లాలో జరుగుతున్న పుష్కర ఘాట్ల నిర్మాణం పూర్తిగా నాసిరకంగా ఉన్నట్లు భక్తులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-11-03T10:18:40+05:30 IST